తప్పటడుగులు (Missteps) - A Short Story
" కూర్చోవచ్చా ?" ఆ ఆద్ర స్వరం రవివర్మని ఈలోకం లోకి పిలిచింది . " ఎంత ఆపినా ఆగలేదు సార్ ." ఆ మాటలో బార్ బోయ్ అసహాయత వెలువడింది . " ఓనర్ గారి ప్రైవేట్ ప్లేసని మొత్తుకున్నా సార్ ." ఆ ఆవడిలో అతని సాక్ష్య వీక్షణ తృష్ణ వెన్నాడింది . " అక్షరాలా నిజం ," ఆగంతుడిలో అదే అద్రత . " సరే నువ్వెళ్లు ," రవిని వెనువీడని అసహనం . " నాపేరు హరిప్రసాద్ , హరి అంటారు ." " గేట్ క్రాషర్ అంటే సరిపోతుంది ." " క్షమించండి , ఇంత ఇబ్బందనుకోలేదు ." " సరే , కూర్చోండి , అనుభవిద్ద్రుగాని ." " అంటే ?" " నా ఏడాది పాటి ఒంటరితనపు బరువు మీచేత మోయిస్తా ." " భలేవారే !" " అయినా ఎందుకీ మొండితనం ?" " నచ్చింది పొందడానికి ." " ఇంటరెస్టింగ్ , ఏమిటి ఇక్కడ నచ్చింది ?" " ఏంబియన్స్ ." " యు గాట్ ఇట్ , వెల్కమ్ ." " థాంక్స్ , కాస్త స్టీవార్డ్ని పిలుస్తారా , బోయిని ఎలాగూ బెంబేల...